కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నపూర్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. మృతుడిని బాక్చా గ్రామ సర్పంచ్ వాస్దేవ్ గా గుర్తించారు. వాస్దేవ్ తన కుమార్తె ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బాధితుడిని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెంగాల్లో గత వారం రోజులుగా పలు హత్యలు చోటుచేసుకున్నాయి.
