Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఉల్లి ధరలపై అసెంబ్లీలో చర్చ…

ఉల్లి ధరలపై అసెంబ్లీలో చర్చ…

అమరావతి: అసెంబ్లీలో నాలుగో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లకే ఉల్లిని సరఫరా చేస్తున్నామని మోపిదేవి వెంకటరమణ అన్నారు. 2 నెలల్లో 4 సార్లు ఉల్లి ధరలపై సమీక్ష చేశామని ఆయన అన్నారు. అధిక వర్షాల కారణంగా దిగుబడులు తగ్గడమే… ఉల్లి కొరతకు కారణం అని మంత్రి మోపిదేవి అన్నారు. సెప్టెంబర్ నుంచి ఉల్లి ధరలు పెరుగుతూ వచ్చాయి. నవంబర్ 14 నుంచి 38 వేల క్వింటాళ్ల సబ్సిడీ ఉల్లిని పంపిణీ చేశామని ఆయన అన్నారు. ఉల్లి సమస్య రాష్ట్ర ప్రభుత్వం వల్ల వచ్చిన సమస్య కాదని అన్నారు. ఉల్లి సమస్య పరిష్కరించేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తున్న సీఎం జగన్ ప్రయత్నాన్ని, ప్రతిపక్ష నేతలు రాజకీయంగా మార్చి.. రాజకీయ లబ్ది పొందాలని, శవాల మీద రాజకీయం చేసినట్లు ప్రతిపక్ష నేతలు చేస్తున్నారని మోపిదేవి విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *