Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 17 వరకు అసెంబ్లీ సమావేశాలు …

17 వరకు అసెంబ్లీ సమావేశాలు …

అమరావతి: సోమవారం ప్రారంభమైన ఉభయ సభల సమావేశాలు ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 14, 15వ తేదీల్లో సభా కార్యక్రమాలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, మండలి చైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్‌ అధ్యక్షతన బీఏసీ సోమవారం విడివిడిగా సమావేశమైంది. శాసనసభ బీఏసీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రులు పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కె.కన్నబాబు, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి ఉపనేత కె.అచ్చెన్నాయుడు హాజరయ్యారు. శాసనమండలి బీఏసీకి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, బీజేపీ ఎమ్మెల్సీ పి.మాధవ్, పీడీఎఫ్‌ తరపున బాలసుబ్రమణ్యం హాజరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *