Breaking News
Home / Crime / హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది

హైదరాబాద్: ఓ వ్యక్తిని హత్య చేసి.. మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో దాచిన ఘటన నగర శివారులో కలకలం సృష్టించింది. పహడిషరీఫ్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి గ్రామ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బౌండ్రీ నుంచి తీవ్ర దుర్వాసన వస్తోందని కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. సిమెంట్ రింగులతో నిర్మించి ఉన్న పాత నీటి ట్యాంక్‌లో మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కుల్లిపోవడంతోపాటు.. ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదుచేసినట్లు డీసీపీ తెలిపారు. మృతదేహానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

Share this on WhatsAppనాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *