Breaking News
Home / States / Andhra Pradesh / కుటుంబ కలహాల నేపథ్యంలో బాలుడిపై దాడి….

కుటుంబ కలహాల నేపథ్యంలో బాలుడిపై దాడి….

గుంటూరు: గుంటూరు జిల్లా ఈపూరు మండలం కూచినపల్లి గ్రామానికి చెందిన నాసిన పెదకొండయ్య, చినకొండయ్య అన్నదమ్ములు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఇరువురు ఘర్షణపడ్డారు. అర్ధరాత్రి సమయంలో పెద్ద కొండయ్య పక్కనే ఉన్న తమ్ముడు ఇంటికి వెళ్లి నిద్రపోతున్న తమ్ముడి కొడుకు రాకేష్(16)పై పెట్రోలు పోసి నిప్పంటిచాడు.

బాలుడు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే స్పదించినప్పటికి బాలుని శరీరం సగానికి పైగా కాలిపోయింది. స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం రాకేష్‌ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *