Breaking News
Home / States / ఎస్కార్ట్ పోలీసుల ఎదుటే బస్సుపై దాడి…

ఎస్కార్ట్ పోలీసుల ఎదుటే బస్సుపై దాడి…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడుపుతోంది. ఈ నేపథ్యంలో బస్సులపై పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం బోగారం దగ్గర.. ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రైవేట్ డ్రైవర్ సురేష్‌కు గాయాలు అయ్యాయి. పరిగి నుంచి వికారాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సుపై సైతం రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం చేయగా, ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఎస్కార్ట్ పోలీసుల ఎదుటే బస్సుపై ఈ దాడి జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ దగ్గర.. ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *