ముంబయి: మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో బుధవారం రాత్రి మాజీ శివసేన నాయకుడు హర్షవర్ధన్ జాదవ్ నివాసంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసి బీభత్సం సృష్టించారు. రాత్రి 12 గంటల సమయంలో తమ ఇంటికి పెద్ద ఎత్తున గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని జాదవ్ భార్య తెలిపారు. జై శివాజీ.. జై శివాజీ.. అంటూ నినాదాలు చేస్తూ తమ ఇంటిపై రాళ్ల దాడి చేశారని, వాచ్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ దాడిలో కారు ధ్వంసమవడమే కాకుండా ఇంటి కిటికీలను కూడా పగులగొట్టారని ఆమె తెలిపారు. సుమారు గంట పాటు రాళ్ల దాడి చేసి వెళ్లిపోయారని జాదవ్ భార్య స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై హర్షవర్ధన్ జాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
