ఉత్తరప్రదేశ్: యూపీలోని బిజ్నౌర్ జిల్లాలో ఒక్కసారిగా ప్రయాణీకులంతా హడలిపోయే ఘటన చోటుచేసుకుంది. బస్సులో సీటు దక్కించుకునేందుకు చిన్నపిల్లలను కిటికీలో నుంచి బస్సులోనికి ఎక్కిస్తున్నారు. ఒక తల్లి తన కుమారుణ్ణి కిటికీ గుండా బస్సులోనికి ఎక్కించేందుకు యత్నించింది. దీంతో ఆ కిటికీకి అడ్డుగా ఉన్న ఇనుమ రాడ్ కిందుగా ఆ బాలుడి తల మెడ వరకూ చిక్కుకుపోయింది. ఆ పిల్లవాడు భయపడిపోయి పెద్ద పెద్దగా ఆర్తనాదాలు చేశాడు. తల్లి కుమారుడి పరిస్థితికి ఏడుస్తూ నా బిడ్డను రక్షించండి అంటూ అక్కడ ఉన్న తోటి ప్రయాణీకులను వేడుకుంది. బిడ్డడు ఏమైపోతాడోనని కన్నీరు మున్నీరుగా విలపించింది. వెంటనే అప్రమత్తమైన తోటి ప్రయాణికులు ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీయటంతో ప్రమాదం తప్పింది.
