Breaking News
Home / National / రాణించిన దీప్తి శర్మ…ఆసీస్‌ లక్ష్యం 133

రాణించిన దీప్తి శర్మ…ఆసీస్‌ లక్ష్యం 133

సిడ్నీ: దీప్తి శర్మ (49*, 46 బంతుల్లో; 3×4) రాణించడంతో ఆస్ట్రేలియాకు భారత్‌ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. స్మృతి మంధాన (10, 11 బంతుల్లో; 2×4)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన షెఫాలి వర్మ (29, 15 బంతుల్లో; 5×4, 1×6) మెరుపు వేగంతో బ్యాటింగ్‌ చేసింది. ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. దీంతో నాలుగు ఓవర్లకు 40/0. ఈ జోరుని చూస్తే భారత్‌ భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది.

కానీ, ఆసీస్‌ స్పిన్నర్‌ జొనస్సెన్‌ (2/24) ధాటికి పరిస్థితి మారిపోయింది. 6.4 ఓవర్లకు 47/3. స్మృతి, షెఫాలి, హర్మన్‌ప్రీత్‌ (2) వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మతో కలిసి జెమిమా రోడ్రిగ్స్‌ (26, 33 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దూకుడుగా ఆడే క్రమంలో జెమీమా పెవిలియన్‌కు చేరినా వేదా (9*, 11 బంతుల్లో)తో కలిసి దీప్తిశర్మ పోరాడింది. అయితే ఆఖర్లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోవడంతో భారత్‌ 132 పరుగులకే పరిమితమైంది. ఆసీస్‌ బౌలర్లలో జోనస్సెన్ రెండు, ఎలిసీ పెర్రీ, డెలిస్సా చెరో వికెట్‌ పడగొట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *