Breaking News
Home / National / 13 మందిని కాపాడిన ఫైర్‌మెన్లకు అవార్డు…

13 మందిని కాపాడిన ఫైర్‌మెన్లకు అవార్డు…

న్యూఢిల్లీ: గత ఆగస్టు జకీర్ నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మందిని కాపాడిన ఫైర్‌మెన్లను ఢిల్లీ ప్రభుత్వం సత్కరించింది. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి 13 మందిని కాపాడిన నలుగురు ఫైర్‌మెన్లకు రూ.2 లక్షలు చొప్పున అవార్డును అందజేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ విభాగం డైరెక్టర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. ఆగస్టు 6న జకీర్ నగర్ ప్రాంతంలోని నాలుగంతస్తుల భవనంలో షార్ట్ సర్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. 13 మందిని కాపాడిన నలుగురు ఫైర్‌మెన్లకు గాయా ఆస్పత్రిలో చికిత్సపొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *