Breaking News
Home / Lifestyle / Business / విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి అజీమ్ ప్రేమ్‌జీ గుడ్‌బై!

విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి అజీమ్ ప్రేమ్‌జీ గుడ్‌బై!

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వచ్చే నెల 30న ఆయన రిటైర్ కానున్నారు. అయితే ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రేమ్‌జీ స్థానంలో్ ఆయన కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రానున్నారు. ప్రస్తుతం రిషద్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా, బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

‘‘భారత ఐటీ పరిశ్రమ మార్గదర్శకుల్లో ఒకరు, విప్రో లిమిటెడ్ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ… 2019 జూలై 30 తన పదవీకాలం ముగియగానే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి రిటైర్ కానున్నారు. కంపెనీకి 53 ఏళ్ల పాటు సారథ్యం వహించిన అనంతరం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయినప్పటికీ.. ఆయన బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారు…’’ అని విప్రో ప్రకటించింది.

ప్రస్తుతం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌‌గా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న అబిదాలీ జడ్‌ నీముచ్‌ వాలా ఇకపై సీఈవోగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. ‘‘వాటాదారుల ఆమోదాన్ని బట్టి జూలై 31, 2019 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి..’’ అని కంపెనీ పేర్కొంది.

Check Also

రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Share this on WhatsAppరానున్న 24 గంటల్లో ఉత్తర కాశీ, చమోలీ, డెహ్రాడూన్, పౌరీ, నైనతాల్ జిల్లాలో భారీ నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *