విశాఖ: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం విశాఖ టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. తప్పెటగుళ్లు, థింసా నృత్యాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రులు గంటా, అయ్యన్నపాత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా నేతలతో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
