Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / జాతిపితకు, మాజీ ప్రధానికి బాబు నివాళి…

జాతిపితకు, మాజీ ప్రధానికి బాబు నివాళి…

అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ట్విట్టర్ వేదికగా వారికి టీడీపీ అధినేత చంద్రబాబు ఘనంగా నివాళులు అర్పించారు. చెడుపై పోరాడుతున్నా, ఆ పోరాటంలో హింసకు చోటివ్వద్దని గాంధీజీ ప్రబోధించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజకీయాల్లో నైతికత, ధార్మికత ఉండాలని, కులాలుగా, మతాలుగా విడిపోని సంపూర్ణ సమైక్య జాతి నిర్మాణం, సమసమాజ స్థాపనలో గాంధీజీ అడుగుజాడలను స్మరించుకుంటూ ముందుకు వెళ్ళడమే, ఆ మహాత్మునికి అందించే నిజమైన నివాళి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

‘జై జవాన్, జై కిసాన్’ పిలుపునిచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అన్న చంద్రబాబు.. ఆయన నిజాయితీ, నిరాడంబరత, వ్యక్తిత్వం, త్యాగశీలత అందరికీ స్పూర్తిదాయకం కావాలని అభిలషించారు. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా దేశం గర్వించదగ్గ ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *