Breaking News
Home / Crime / బాచుపల్లి అటవీ ప్రాంతంలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి

బాచుపల్లి అటవీ ప్రాంతంలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి

హైదరాబాద్: బాచుపల్లి అటవీ ప్రాంతంలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాచుపల్లిలోని శ్రీచైతన్య కాలేజీ సమీపంలో ఉన్న పొదళ్లలో ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకుంది. అటు వైపు వచ్చిన స్వామి అనే వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్వామి సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన బాచుపల్లి ఎస్సై వీరశేఖర్.. వృద్ధురాలి మృతదేహాన్ని పరిశీలించి ఆమె ఎవరో గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలూ లభించలేదని చెప్పారు.

మృతి చెందిన వృద్ధురాలి వయసు దాదాపు 65 ఏళ్లు ఉండవచ్చునని ఎస్సై తెలిపారు. ఘటనాస్థలంలో ఓ చేతి సంచి ఉందని, అందులో చీరను తీసుకొచ్చి ఆమె ఉరి వేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ చేతి సంచిపై ‘విఘ్నేశ్వర శారీ సిల్క్స్- ఎర్రగడ్డ’ అని ఉందని పోలీసులు చెబుతున్నారు. చీరతో చెట్టుకు ఉరివేసుకున్న రీతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అంబులెన్సులో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Check Also

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని

Share this on WhatsAppహైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మరో స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసింది. కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి నందమూరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *