Breaking News
Home / Lifestyle / Business / అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల గురించి బ్యాడ్ న్యూస్ !

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఆఫర్ల గురించి బ్యాడ్ న్యూస్ !

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ డిస్కౌంట్‌లకు చెల్లు
దేశంలో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వివిధ సందర్భాలను పురస్కరించుకుని భారీఎత్తున డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, వడ్డీలేని నెలసరి వాయిదాల చెల్లింపులు వంటి సౌకర్యాలు కల్పించి అమ్మకాలను పెంచుకునేవి. వినియోగదారులకు కూడా ఎంతో సౌలభ్యంగా ఉండేది. జనవరిలో కూడా రిపబ్లిక్‌ డే సేల్‌ పేరుతో ఈ రెండు సంస్థలు పోటాపోటీగా డిస్కౌంట్‌ ఆఫర్లు ఇచ్చాయి. మార్కెట్‌లో రిటైల్‌ షాపులలో (ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌) దొరకని కొన్ని వస్తువులను ప్రత్యేకంగా ఈ సంస్థలలోనే అమ్మకాలకు ఉంచేవారు. ఉదాహరణకు వన్‌ ప్లస్‌ మొబైల్‌ ఫోన్‌లు అమెజాన్‌లోనే లభించేవి. షామి సంస్థకు చెందిన ఉత్పత్తి పోకో ఎఫ్‌1 మొబైల్‌ ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లోనే లభించేవి. చిన్న వ్యాపార సంస్థలు ఈ అగ్రగామి సంస్థలతో పోటీకి నిలబడలేని పరిస్థితి ఏర్పడింది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ చిన్న సంస్థలతో గొంతుకోత పోటీలకు దిగుతూ (కట్‌ త్రోట్‌ కాంపిటీషన్‌) చాలా తక్కువ ధరలకే వినియోగదారులకు వస్తువులను అందజేస్తూ వస్తున్నారు. మొత్తం పరిస్థితి సమీక్షించిన ప్రభుత్వం ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిబంధనలు పూర్తిగా మార్చివేసింది. ఇక నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఏ వస్తువును ప్రత్యేకంగా వారి సంస్థల ద్వారా మాత్రమే అమ్మడానికి వీలులేదు. ఈ సంస్థలకు వాటా ఉన్న ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా ఈ సంస్థల ద్వారా అమ్మడానికి వీలు పడదు. దీంతో జనవరి 31 నుంచే అమెజాన్‌లో చాలా వస్తువుల అమ్మకాలను నిలిపివేశారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇకముందు భారీ డిస్కౌంట్‌లను ఇచ్చే అవకాశాలు బాగా తగ్గిపోనున్నాయి. కొత్త నిబంధనలతో ఈ సంస్థల వ్యాపార పరిమాణం కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. కొత్త నిబంధనలు చిన్న వ్యాపారస్థులకు ఏ మేరకు ఉపయోగపడతాయో తేలవలసి ఉంది.

Check Also

పసిడికి కళ

Share this on WhatsAppమళ్లీ మదుపర్లను ఆకర్షిస్తున్న బంగారం అంతర్జాతీయ పరిణామాలే కారణం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మందగించడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *