Breaking News
Home / National / చిదంబరంకు బెయిల్ మంజూరు ….

చిదంబరంకు బెయిల్ మంజూరు ….

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం 106 రోజులుగా తీహార్ జైలులో ఉన్నారు. ఆగష్టు 21న ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. అయితే బుధవారం బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం తన పాస్‌పోర్టును అప్పగించాలని, దేశం దాటవద్దని, మీడియాతో మాట్లాడవద్దని భారత అత్యున్నత న్యాయస్థానం షరతులు విధించింది. రూ.2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును తీవ్ర ఆర్థికనేరంగా పరిగణించి బెయిల్ ఇవ్వవద్దని ఈడీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది. చిదంబరానికి బెయిల్ ఇస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని ఈడీ పేర్కొంది. కానీ ఈడీ వాదనను జస్టిస్ భానుమతి ధర్మాసనం తోసిపుచ్చింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *