Breaking News
Home / States / Andhra Pradesh / పార్టీ మార్పుపై బైరెడ్డి తాజా ప్రకటన….

పార్టీ మార్పుపై బైరెడ్డి తాజా ప్రకటన….

కర్నూలు: కార్యకర్తల అభిప్రాయం మేరకు త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని మోదీకి సింపతి ఉందని, ప్రత్యేక హోదా అనేది పాత చింతకాయ పచ్చడిలాంటిదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్ వల్లే రాష్ట్రం విడిపోయిందని విమర్శించారు. అప్పులకు వడ్డీ కట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, జీతాలు రావనే ఆందోళన ఉద్యోగాల్లో నెలకొందన్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను ఏడాదికే వదులుకోవడం వల్ల తీరని నష్టం జరిగిందని పేర్కొన్నారు. రాజధాని, హైకోర్టు ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *