Breaking News
Home / States / Andhra Pradesh / బోటు వెలికితీసేందుకు బాలాజీ మెరైన్స్ సంస్థ ఏర్పాట్లు

బోటు వెలికితీసేందుకు బాలాజీ మెరైన్స్ సంస్థ ఏర్పాట్లు

రాజమండ్రి: కచ్చులూరు వద్ద బోటు వెలికితీసేందుకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. రోడ్డు మార్గంలో సంఘటన స్థలానికి జేసీబీ, ప్రత్యేక రోప్‌లను తరలిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా పశివేదలకు చెందిన సాహాసవీరుడు వెంకట శివ పర్యవేక్షణలో గోదావరిలో మునిగిన బోటును వెలికితీసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు జగన్ ప్రభుత్వం కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు అనుమతి ఇచ్చింది. బోటు ప్రమాదం జరిగి నేటికీ 15 రోజులు అవుతోంది. బోటు ప్రమాదంలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 36 మృత దేహాలను వెలికితీశారు. ఇంకా 16 మృత దేహాలు లభ్యం కాలేదు. బోటు వెలికి తీస్తే మృతదేహాలు బయటపడతాయని మృతుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *