Breaking News
Home / States / జూనియర్ బాలయ్యకు బాలకృష్ణ సంతాపం….

జూనియర్ బాలయ్యకు బాలకృష్ణ సంతాపం….

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు బాలకృష్ణ డైలాగులతో అలరించి ‘జూనియర్‌’ బాలయ్యగా పేరు పొందిన గోకుల్ సాయి కృష్ణ శుక్రవారం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ సోషల్‌మీడియా వేదికగా గోకుల్‌ సాయి కృష్ణ మృతిపట్ల సంతాపం తెలిపారు.

‘మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. నేనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి అభిమాని గోకుల్‌ ఈరోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటగా అనిపించేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ జ్వరంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నాకు బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *