Breaking News
Home / Film News / బాలకృష్ణ సినిమాకు టైటిల్ ఖరారు!…

బాలకృష్ణ సినిమాకు టైటిల్ ఖరారు!…

ఫిల్మ్ న్యూస్: నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 105వ చిత్రం కె.ఎస్‌.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సి.కల్యాణ్ నిర్మాత. ఈ సినిమా టైటిల్ విషయంలో పలు వార్తలు వినపడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఈ చిత్రానికి `రూలర్‌` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఇదే టైటిల్ ఖరారైందనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జెమినీ టీవీ ఈ సినిమా టైటిల్‌ను `రూలర్` అని ప్రకటించడం విశేషం. దీంతో ఈ సినిమా టైటిల్‌పై కొనసాగుతున్న సందిగ్ధతకు దాదాపు తెరపడినట్లే. ఇక చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *