Breaking News
Home / Lifestyle / Recipes / అరటి-క్యారెట్‌ వడలు తయారీ విధానం మీ కోసం…!

అరటి-క్యారెట్‌ వడలు తయారీ విధానం మీ కోసం…!

అరటి-క్యారెట్‌ వడలు
కావలసినవి: అరటికాయ – 1 (ఉడికించుకోవాలి), బియ్యప్పిండి – 1 కప్పు, పచ్చి శనగ పప్పు – అర కప్పు(నానబెట్టుకోవాలి), క్యారెట్‌ గుజ్జు – అర కప్పు, ఉల్లిపాయ – 1(సన్నగా తరిగినవి), వెల్లుల్లి ముక్కలు – పావు టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉడికించిన అరటికాయను ముద్దలా చేసుకోవాలి. క్యారెట్‌ గుజ్జు, బియ్యప్పిండి, పచ్చి శనగపప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గారెల పిండి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్‌ సైజ్‌ మిశ్రమం తీసుకుని చేత్తో వడలా నొక్కి మరుగుతున్న నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే వడలు కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.

Check Also

సజ్జలతో మంచూరియా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *