ఢాకా: న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కి ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. తిషారా పెరీరా వేసిన ఓవర్లో బంతి షకీబ్ ఎడమ చేతికి తగలడంతో అతని ఎడమ చేతి వేలకి ఫ్రాక్చర్ అయింది.
దీంతో అతను వన్డే సిరీస్ నుంచి దూరమయ్యాడు. ‘‘మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఎక్స్-రేలో షకీబ్ ఎడమ చేతి వేలు విరిగినట్లు తెలిసింది. ఈ గాయం నుంచి అతను కోలుకొనేందుకు మరో మూడు వారాలు పడుతుందని’’ బంగ్లా క్రికెట్ బోర్డు ఫిజీషియన్ డెబాషిస్ చౌదరీ తెలిపారు.
అయితే మూడు వారాల్లో షకీబ్ కోలుకోకుంటే.. కివీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కి కూడా అతను దూరం కానున్నాడు. అయితే ప్రపంచకప్ వరకూ షకీబ్ కోలుకోకుంటే.. బంగ్లాదేశ్‌కి ఆ టోర్నమెంట్లో కష్టాలు తప్పవని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.