Breaking News
Home / National / రోహిత్ ఆటతీరుపై బంగ్లాదేశ్ కెప్టెన్ వ్యాఖ్యలు…

రోహిత్ ఆటతీరుపై బంగ్లాదేశ్ కెప్టెన్ వ్యాఖ్యలు…

రాజ్ కోట్: రాజ్ కోట్ లో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం తెలిసిందే. కేవలం 43 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. వాటిలో 6 ఫోర్లు, 6 భారీ సిక్సులున్నాయి. దీనిపై బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా వ్యాఖ్యానించాడు. తాము రోహిత్ శర్మను నిలువరించలేకపోయామని అంగీకరించాడు. అతడి జోరుకు తమ బౌలర్లు బేజారెత్తిపోయారని, ఇలాంటి పిచ్ పై రోహిత్ శర్మను నియంత్రించడం ఎంతో కష్టం అని అభిప్రాయపడ్డాడు. 175కి పైగా పరుగులు చేసుంటే తాము మ్యాచ్ ను కాపాడుకునేందుకు అవకాశాలు ఉండేవని మహ్మదుల్లా పేర్కొన్నాడు.

Check Also

ఎంజీ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు….

Share this on WhatsAppన్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా సరికొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *