Breaking News
Home / Sports / బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌కూ వర్షం దెబ్బ

బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌కూ వర్షం దెబ్బ

బ్రిస్టల్: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. బ్రిస్టల్‌లో వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఇప్పటి వరకు టాస్ పడలేదు. పిచ్ తడవకుండా కప్పిన కవర్లపై వర్షపు నీరు పేరుకుపోయింది. దీంతో గ్రౌండ్ సిబ్బంది అలుపుసొలుపు లేaకుండా నీటిని తోడుతూనే ఉన్నారు. నిన్న సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికా-విండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. అంతకుముందు పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. టాస్ కూడా పడకుండానే ఆ మ్యాచ్ రద్దు అయింది. మ్యాచ్ రద్దు కారణంగా ఒక్కో జట్టుకు ఒక్కో పాయింట్ కేటాయిస్తున్నారు.

Check Also

టాప్ ర్యాంక్ కు అడుగు దూరంలో కోహ్లీ…

Share this on WhatsAppదుబాయి: టెస్టుల్లో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోవడానికి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకే ఒక్క …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *