Breaking News
Home / National / బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపు….

బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపు….

ఢిల్లీ: బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ) సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వారు ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌(ఐబీఏ)కు నోటీసు అందజేశారు. విలీనం ద్వారా అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగవేతదారుల నుంచి రుణాలు వసూలు చేస్తే బ్యాంకింగ్‌ కష్టాలు తీరతాయని దానికి విలీనం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్‌ ఛార్జీలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నోటీసులో మొత్తం ఆరు అంశాలను పేర్కొంటూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *