ఇంటర్నెట్ డెస్క్: అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధిక సెలవు రోజులు ఉన్నాయి. శని, ఆదివారాలకు తోడు దసరా, దీపావళి, మరికొన్ని ప్రత్యేక రోజులు ఈ నెలలోనే ఉండడంతో మొత్తం 11రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పటికే గాంధీ జయంతి(అక్టోబర్ 2) సెలవు ముగియగా ఇంకా 10రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. పండుగ సీజన్ కావడంతో డబ్బులతో అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగదు అవసరమున్న వారు జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సెలవులు అన్ని ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయి. ఇందులో అక్టోబర్ 26, 27, 28 వరుసగా మూడురోజుల పాటు సెలవులు ఉండడం గమనార్హం.
