Breaking News
Home / States / రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలు…

రాజ్ భవన్ లో బతుకమ్మ వేడుకలు…

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో పాటలు పాడి మహిళలతో కలిసి గవర్నర్ బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 5వ తేదీ వరకు రాజ్‌భవన్‌లో ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *