Breaking News
Home / National / జర్మనీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు…

జర్మనీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు…

జర్మనీ: బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఖండాంతరాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహిస్తున్నారు. జర్మనీలోని మ్యూనిక్ నగరంలో నాలుగోవసారి తెలంగాణా సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 200లకు పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో ఆ పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. పసందైన వంటకాలతో వేదిక గుమగుమలాడింది. చిన్న పిల్లలు సైతం తమ ప్రాంత సంస్కృతిని చూసి చాలా ఆనందించారు. తెలంగాణలో జరుపుకున్న విధంగానే జర్మనీలోనూ బతుకమ్మ సంబురాలను నాల్గవ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాసులు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవాలని అక్కడి మహిళలు పిలుపునిచ్చారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *