Breaking News
Home / National / టీఏసీఏ తాసా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు…

టీఏసీఏ తాసా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు…

జొహన్నెస్‌బర్గ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (టీఏసీఏ తాసా) ఆధ్వర్యంలో జొహన్నెస్‌బర్గ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉంటున్న తెలంగాణ వారు భారీ సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్‌అమెరికా (తానా) అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ముఖ్యఅతిథిగా వచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందికి పైగా ప్రవాసీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలుగువారి కోసం తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలను, కృషిని వివరించారు. స్థానికంగా నివాసముంటున్న తెలుగువారితో ప్రత్యేకంగా సమావేశమై వారి జీవనశైలి, ఉద్యోగాలు, వ్యాపారాలు తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తాము వారికి అండగా నిలుస్తామన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *