Breaking News
Home / Film News / ఇకపై కాస్త జాగ్రత్తగా ఉంటారట…!

ఇకపై కాస్త జాగ్రత్తగా ఉంటారట…!

ఫిల్మ్ న్యూస్: బాలీవుడ్‌లో ఏదో ఒక ప్రేమ జంట తరచూ వార్తలో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు అక్కడ క్రేజీ లవర్స్‌ అంటే కార్తీక్‌ ఆర్యన్‌, సారా అలీఖాన్‌ పేర్లే వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనీ, పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. ఇద్దరి మీదా గాసిప్పులు పుట్టుకురావడంతో ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారట. వృత్తిపరంగా సెట్‌లో క్లోజ్‌గా ఉన్నా, పేకప్‌ చెప్పాక ప్రైవేట్‌గా ఉండాలనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకు కారణం ఈ మధ్యన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫొటోలు, వారిద్దరిపై వచ్చిన హెడ్‌లైన్లే. ఇటీవల కార్తీక్‌ ఆర్యన్‌, సారా ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఫొటోగ్రాఫర్లను ‘మా ఇద్దరినీ కలిపి ఫొటోలు తీయొద్దు’ అని రిక్వెస్ట్‌ చేశారట. ప్రస్తుతం వీరిద్దరు ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *