Breaking News
Home / Crime / మగాళ్లను వదిలిపెట్టని మృగాళ్లు…! యువకుడికి లైంగిక వేధింపులు

మగాళ్లను వదిలిపెట్టని మృగాళ్లు…! యువకుడికి లైంగిక వేధింపులు

అత్యాచారాలకు, హత్యలకు ఆడమగ తేడా లేదు.. మారుతున్న సమాజ పోకడలు, మానవమనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తనకు కావాల్సింది తీసుకోవడం.. అందినంత వరకు దోచుకోవడం.. అనే కోణంలో మానవుల నైజం బయటపడుతోంది. మారుతున్న కాలంలో సోషల్ మీడియా అంటూ ఉర్రూతలుగుతున్న యువతకు అదే శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువకుడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూసి అనంతరం ఫ్యాన్స్ అంటూ కిడ్నాప్ చేశారు. ఆపై కారులో యువకుడిపై నలుగురు యువకులు అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

ఫ్యాన్స్ అంటూ యువకుడిపై లైంగికచర్యలు
దేశ అర్థిక రాజధాని ముంబయిలో ఈనెల ఎనిమిదన ఈ సంఘటన జరిగింది. ఓ 22 యువకుడికి షేల్పీలు దిగి సోషల్ మీడియాలో పెట్టడడం ఇష్టంగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ రెస్టారెంట్ వద్ద సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆయువకుడి లోకేషన్‌ను ట్రేస్ చేసిన నలుగురు నిందితులు పోస్ట్ చేసిన పదిహేను నిమిషాల్లోనే తన ఫోటోలు చాలా బాగా ఉన్నాయని , తామంతా అతని ఫ్యాన్స్ అంటూ నమ్మబలికారు. కలుస్తామని సమాచారం ఇచ్చారు. దీంతో నమ్మిన యువకుడు అందుకు అంగీకరించాడు.

బలవంతంగా కారులోకి

దీంతో వెంటనే ముంబై ఎయిర్‌పోర్టు వద్ద ఇద్దరు వ్యక్తులు బాధితుడిని కలిశారు. అనంతరం సిగరెట్ తాగేందుకు బైక్‌పై రావాలని కోరడంతో నమ్మిన యువకుడు వారితో కలిసి బైక్‌పై వెళ్లాడు. దీంతో ఇరవై నిమిషాల పాటు బైక్‌పై ప్రయాణించిన అనంతరం ఓ హోటల్ సమీపంలో ఆగి, అక్కడ అప్పటికే వేచి చూస్తున్నవారి కారులోకి రావాలని కోరారు. అయితే కారులోకి వచ్చేందుకు బాధితుడు నిరాకరించడంతో బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అప్పటికే కారులో ఓ మైనర్‌తో పాటు మరోకరు ఉన్నట్టు బాధిత యువకుడు తెలిపాడు.

లైంగిక చర్యలతో దాడి

ఇక బలవంతంగా కారులో తోసేసిన అనంతరం తమతో లైంగిక కార్యక్రమాల్లో పాల్గోనాలని యువకులు బాధితుడిపై ఒత్తిడి తెచ్చారు. ఒప్పుకోని యువకుడిపై దాడి చేసినట్టు చెప్పారు. అలా మూడు గంటలపాటు కారులోనే తిప్పుతూ.. నరకయాతన చూపించారని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఇలా రోడ్ల పైనే అర్థరాత్రి 1.30 వరకు కారులో తిప్పిన అనంతరం ఓ ఆసుపత్రి సమీపంలోని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. అనంతరం తేరుకున్న బాధిత యువకుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు చెప్పాడు. వారితో కలిసి బాధితుడు వినోభాభవే నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుల అరెస్ట్

కాగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సంఘటనకు పాల్పడ్డ నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారంతా ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతానికి చెందిన మెహుల్ పర్మర్ 21, అసిఫ్ ఆలీ అన్సారీ 23, పియూష్ చౌహన్ 22 గా గుర్తించి కేసులు పలు అసహజ సెక్స్ తోపాటు పలు సెక్షన్ల క్రింద కేసును నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *