Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన వల్ల ముస్లింల స్వప్నం నెరవేరింది….

ఆయన వల్ల ముస్లింల స్వప్నం నెరవేరింది….

విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత విజయవాడ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లాలనుకున్న ముస్లింల చిరకాల స్వప్నం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వల్లనే నెరవేరిందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. 2020 ఏడాదికిగాను హజ్‌ యాత్ర తొలి దరఖాస్తును డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా గురువారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టి సారించారని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో హజ్‌ యాత్రకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. 2020 హజ్‌ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులకు నవంబర్ ​10 చివరి తేదీ అని చెప్పారు. పవిత్ర హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్న యాత్రికులకు రూ.60వేలు, అంతకు మించి ఆదాయం ఉన్నవారికి రూ.30వేలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. క్యాబినేట్‌ ఆమోదం పొందిన తరువాత ఈ సాయం యాత్రికులకు అందజేస్తామని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *