Breaking News
Home / Crime / దిశ ఘటన మరవకముందే..

దిశ ఘటన మరవకముందే..

పాట్నా: షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే బిహార్‌లో మరో దారుణం జరిగింది..బీహార్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బక్సర్ జిల్లాలోని కుకుఢా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ఓ బాలికను అత్యాచారం చేసి చంపేసిన అనంతరం బాలికకు నిప్పంటించి తగలపెట్టారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ఇలాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో కాలిన ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు బక్సర్ డీఎస్పీ సతీశ్‌కుమార్ తెలిపారు.రాజధాని నగరం పాట్నాకు సుమారు 100కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతురాలు మైనర్, మేజర్ అనే విషయంపై స్పష్టత వస్తుందని డీఎస్పీ తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *