Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీశైలంలో ‘సౌభాగ్యమస్తు’ ప్రారంభం

శ్రీశైలంలో ‘సౌభాగ్యమస్తు’ ప్రారంభం

క్షేత్రంలో పెళ్లి చేసుకున్న వధూవరులకు దర్శనం, ఆశీర్వాదం, ప్రసాదం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో వివాహం చేసుకునే వధూవరులకు శ్రీశైల దేవస్థానం సౌభాగ్యమస్తు పథకాన్ని ప్రారంభించింది. వధూవరులకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం, ఆశీర్వాదం కలిగేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేవస్థానం కల్పించిన ఈ సౌకర్యంపై భక్తులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా శ్రీశైల క్షేత్ర పరిధిలో వివాహం చేసుకుని, పెళ్లి దుస్తులతో ఆలయానికి విచ్చేసిన నూతన వధూవరులకు దేవస్థానం తరపున ఉచిత దర్శనం, ఆశీర్వాదం అందించనున్నట్లు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. ఈ పథకంలో వధూవరులతో పాటు వారి సంబంధీకులైన ముగ్గురికి హరిహరరాయ గోపుర ద్వారం నుంచి ఉచిత ప్రవేశం, శీఘ్రదర్శన క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. దర్శనం అనంతరం వధూవరులను ఆశీర్వదించి, లడ్డూ ప్రసాదాలు(100 గ్రాములు బరువు గల రెండు లడ్లు), వధువుకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక వస్త్రం, పసుపు, కుంకుమ, గాజులు అందజేస్తామని తెలిపారు. ఈ పథకం కింద మొదటిసారిగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, బోయిలపల్లి గ్రామానికి చెందిన ఎలకా సుబ్బారావు, అనూష దంపతులను ఆశీర్వదింశారు. కార్యక్రమంలో ఏఈవో కృష్ణారెడ్డి, పర్యవేక్షకుడు మల్లికార్జునరెడ్డి, ఉభయ దేవాలయాల అర్చకస్వాములు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *