Breaking News
Home / National / మరోసారి లాక్‌డౌన్‌ దిశగా చైనా..!

మరోసారి లాక్‌డౌన్‌ దిశగా చైనా..!

బీజింగ్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ పురిటిగడ్డ చైనా మరోసారి లాక్‌డౌన్‌ దిశగా పయనిస్తోంది. వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసి కరోనా ఫ్రీ దేశంగా ప్రకటిద్దామని సిద్ధమవుతున్న తరుణంలో కొత్త కేసులు వెలుగు చూడటం ఆ దేశంలో కలకలం రేపుతోంది. చైనా ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం ప్రకారం.. శుక్రవారం నాలుగు పాజిటివ్‌ కేసులు, శనివారం మరో ఏడు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవ్వన్నీ కూడా రాజధాని నగరం బీజింగ్‌లోనే నమోదు కావడం గమనార్హం. పాజిటివ్‌గా సోకిన వారితో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారందరినీ కోవిడ్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా గడిచిన 55 రోజుల్లో కనీసం ఒక్క కరోనా కేసు కూడా ఆ దేశంలో నమోదు కాలేదు. అయితే ఊహించని విధంగా ఒక్కసారే పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోరెండు రోజులపాటు ఇలానే కొత్త కేసులు బయటపడితే.. మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *