Breaking News
Home / Lifestyle / Business / ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్.. 43 అంగుళాల స్మార్ట్‌టీవీ రూ.24 వేలే!

ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్.. 43 అంగుళాల స్మార్ట్‌టీవీ రూ.24 వేలే!

న్యూఢిల్లీ: ఈ నెల 1న ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ రేపటితో ముగియనుంది. సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, హోం అప్లయెన్సెస్‌తోపాటు ఇతర ఉత్పత్తులపైనా భారీ ఆఫర్లు అందిస్తోంది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అలాగే, ప్రతి 8 గంటలకు ఓసారి హాట్ డీల్స్ అందిస్తోంది. ఇందులో పదిశాతం వరకు రాయితీ ఇస్తోంది.

బెస్ట్ డీల్స్ ఇవే..
ఫ్లిప్‌స్టార్ట్ సేల్‌లో భాగంగా ఏసర్ ఆస్పైర్ 5 ల్యాప్‌టాప్ ధరను రూ.59,999 నుంచి రూ.39,990కి తగ్గించింది. 8జీబీ ర్యామ్, 1టీబీ హార్డ్‌డిస్క్, విండోస్ 10 ఓఎస్, 15.6 అంగుళాల డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లు కలిగిన ఈ ల్యాప్‌టాప్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. అదనంగా రూ.16 వేల వరకు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. రూ.47,509 విలువైన హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్ 360 ధరను రూ.42,990కి తగ్గించింది. ఏసర్ ఆస్పైర్ 3పై భారీ తగ్గింపు అందిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.42,720 కాగా, ఇప్పుడు దీనిని రూ.27,990కే అందిస్తోంది.

హెచ్‌పీ 15 క్యూ 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌ను 51,990కి, ఆసుస్ జెన్‌బుక్ 13ను రూ.64,990కి అందిస్తుండగా, శాంసంగ్ ఏఎక్స్ 3000 రూమ్ ఎయిర్ ప్యూరిఫైర్‌పై ఏకంగా రూ.15,500 వరకు రాయితీ ఇస్తూ రూ.8,499కి విక్రయిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అలాగే, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుపై అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ ప్రకటించింది. ఫుజిఫిల్మ్ ఎక్స్ 100ఎఫ్ మిర్రర్‌లెస్ కెమెరాను రూ.82,999కి, వీయూ పిక్స్‌లైట్ 43 అంగుళాల 4కే స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీని రూ.23,999కి అందుబాటులో ఉంచింది.

Check Also

కశ్మీర్‌ వద్దు..కోహ్లిని ఇవ్వండి: పాక్ అభిమానులు

Share this on WhatsAppఇస్లామాబాద్‌ : ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ చిత్తుగా ఓడటం తో ఆ దేశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *