Breaking News
Home / States / భలేగా ఊపందుకున్న ఫ్యాన్సీ నంబర్స్‌….

భలేగా ఊపందుకున్న ఫ్యాన్సీ నంబర్స్‌….

సిటీబ్యూరో: రవాణాశాఖ ఖైరతాబాద్‌ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలంలో పలువురు వాహనదారులు తమ క్రేజ్‌ను చాటుకున్నారు. నచ్చిన నంబర్‌ను రూ.లక్షలు పోసి దక్కించుకున్నారు. ఇలా ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా బుధవారం ఒక్కరోజే సంస్థకు రూ.27,44,157 ఆదాయం వచ్చింది. రేంజ్‌ రోవర్‌ 3.0 ఎల్‌డబ్ల్యూబీ వాహనానికి టీఎస్‌09 ఎఫ్‌హెచ్‌ 9999 నంబర్‌కు రూ.10.35 లక్షలకు బిడ్‌ వేసి ట్రాక్స్‌ అండ్‌ టవర్స్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ దక్కించుకుంది. అలాగే మసరట్టిలవెంటి వాహనం కోసం టీఎస్‌09 ఎఫ్‌జే 0009 నంబర్‌కు గంగవరం పోర్ట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.4.01 లక్షలు వెచ్చించింది. స్కోడా సూపర్బ్‌ ఎల్‌ అండ్‌ కే వాహనానికి టీఎస్‌09 ఎఫ్‌జే 0099 నంబర్‌కు రూ.2.97 లక్షలకు బిడ్‌ వేసి ఈటీఏ స్టూడియో ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *