హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు హస్ అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ను చిక్కడపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
