ఫిల్మ్ న్యూస్: గోపీచంద్, మెహ్రీన్ కలిసి నటించిన `చాణక్య` సినిమా దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా గోపీచంద్‌కు అయిన యాక్సిడెంట్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పెద్ద యాక్సిడెంట్ జరిగి గోపీచంద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ యాక్సిడెంట్ గురించి తాజాగా స్పందించాడు.
`సినిమాలో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసేశాం. చాలా చిన్న షాట్ చివరి రోజు ప్లాన్ చేశాం. పరిగెత్తుకుంటూ వచ్చి స్టార్ట్ అయి ఉన్న బైక్‌ను తీసుకెళ్లాలి. అయితే ఆ బైక్‌కు కొంచె ప్రాబ్లమ్ ఉండడంతో ఫుల్‌గా రైజ్ అయిపోయింది. కంట్రోల్ చేయడం కష్టమైంది. వదిలేద్దామంటే ఎదురుగా ఇద్దరు కెమెరామెన్లు ఉన్నారు. అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించా. కుదరలేదు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే నరాలు కట్ అయ్యి రక్తం రావడం మొదలైంది. అది మారుమూల పల్లె ప్రాంతం కావడంతో దగ్గర్లో హాస్పిటల్ లేదు. దీంతో మూడు గంటలపాటు ప్రయాణించి హాస్సిటల్‌కు వెళ్లాం. ఆ మూడు గంటలూ రక్తం కారుతూనే ఉంద`ని గోపీచంద్ చెప్పాడు.