Breaking News
Home / States / ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం….

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం….

నల్గొండ: ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి నుంచి నల్గొండకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సు వెనుక చక్రం ఊడిపోయింది. రన్నింగ్‌లో ఉన్న బస్సు చక్రం ఊడిపోవడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ఎల్లారెడ్డిగూడెం శివారులో చోటు చేసుకుంది. డ్రైవర్‌ అప్రమత్తమై బస్సు నిలివేయడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణీకులంతా సురక్షితంగా బయటకు వచ్చారు. బస్సులులో దాదాపు 30 మంది ప్రయాణికులు  ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనుభవం లేని డ్రైవర్లను పెట్టి ప్రయాణికుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *