Breaking News
Home / National / ఆసుపత్రి నుంచి బిగ్ బి డిశ్చార్జ్ …

ఆసుపత్రి నుంచి బిగ్ బి డిశ్చార్జ్ …

ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం మెరుగుపడడంతో శుక్రవారం రాత్రి 9.45 గంటలకు ఆయనను నానావతి ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధ సమస్యతో ముంబై నగరంలోని నానావతి ఆసుపత్రిలో చేరారని ఆ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అమితాబ్‌ను అతని కుమారుడు అభిషేక్ బచ్చన్, భార్య జయాబచ్చన్‌లు తన తెల్లరంగు రేంజ్ రోవర్ కారులో వచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లారు. అమితాబ్ సాధారణ వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారని, ఆయన బాగానే ఉన్నారని నానావతి ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. కానీ నానావతి ఆసుపత్రి వైద్యులు మాత్రం అమితాబ్ ఆరోగ్యంపై ఎలాంటి బులిటిన్ విడుదల చేయలేదు. బిగ్ బి హోస్ట్ చేస్తున్న ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని టీవీ వర్గాలు వెల్లడించాయి. తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తాను టీబీ, హెపటైటిస్ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *