ప్రస్తుతం తెలుగు రియాలిటీ షోలో బిగ్‌బాస్ 3 విజయవంతంగా రన్ అవుతుంది. నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 90 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ బిగ్‌బాస్ మూడో సీజన్ కూడా ముగియనుంది. అయితే గత రెండు సీజన్స్‌తో పోల్చితే ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ అంతగా లేదని వీక్షకులు భావిస్తున్నారు. అదే సమయంలో బిగ్‌బాస్ 1లో విన్నర్‌గా నిలిచిన శివ బాలాజీ బిగ్‌బాస్ 3పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో శివ బాలాజీ మాట్లాడారు. తాను బిగ్‌బాస్ సీజన్ 3ని రెగ్యులర్‌గా చూడటం లేదని తేల్చి చెప్పేశాడు. కొని ఎపిసోడ్స్‌ను మాత్రమే చూశానని ఆయన తెలిపారు. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ లేదని, తనకు కనెక్ట్ కాలేదని కూడా తెలిపారాయన. అలాగే వ్యక్తిగత పనులు, షూటింగ్‌ల కారణంగా సీజన్‌ను చూడలేకపోతున్నానని కూడా తెలిపారు శివ బాలాజీ.