తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న ప్రోగ్రాం ఇపుడు ఏదైనా వుంది అంటే, అది బిగ్ బాస్ రియాలిటీ షో అనే చెప్పాలి. మెల్లమెల్లగా అందరి అసలు రూపాలు బయట పడుతున్నాయి. ప్రేక్షకులకు మాత్రం ఆ ఇద్దరు మాత్రమే కనబడుతున్నారు. బుల్లితెర కార్యక్రమాల్లో విపరీతమైన క్రేజ్ వున్న శ్రీముఖి మరియు, సింగర్ గా అశేష ఆదరణ వున్న రాహుల్. మిగతా కుటుంబ సభ్యుల పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ వీరిద్దరూ హైలెట్ అవుతున్నారని చెప్పాలి.
బిగ్ బాస్ హౌస్ లో బాబా మాస్టర్ లీడ్ చేస్తారని చాలామంది అభిప్రాయపడ్డారు, కానీ ఆదివారం జరిగిన ఒక సంఘటన తో బాబా డబుల్ గేమ్ ఆడారని తేలిపోయింది. శివజ్యోతి అన్న మాటలకు బాదపడ్డ బాబా మాస్టర్ అసలు రంగు బయట పడింది. శ్రీముఖి నామినేషన్ విషయం లో చాల తేలికగా తీస్కొని, శివజ్యోతి విషయం లో ఇలా చేయడం తో బాబా మాస్టర్ అంతగా ఆకట్టుకోలేరు అని అర్ధం అయింది. బాబా మాస్టర్ బిహేవియర్ తో ఫైనల్ వరకు రాహుల్, శ్రీముఖి లు కాకుండా వేరే ఎవరు వచ్చే అవకాశం లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు.