Breaking News
Home / National / బీహార్‌లో చోటుచేసుకున్న భారీ చోరీ…

బీహార్‌లో చోటుచేసుకున్న భారీ చోరీ…

బీహార్‌: బీహార్‌లోని పాట్నాలో మెహిదీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గోడౌన్ వద్ద సెక్యూర్టీ గార్డు, డ్రైవర్‌ను బంధించిన దుండగులు సుమారు 50 లక్షల ఖరీదైన ఎల్ఈడీ టీవీలను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. దంతేరాస్‌, దీపావళి పండుగల నేపథ్యంలో స్థానిక వ్యాపారి భారీ ఎత్తున టీవీలను గోడౌన్‌కు తెప్పించారు. ఆదివారం రాత్రి 11.30 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకున్నది. 250 ఎల్ఈడీ టీవీలతో పాటు 35 వేల నగదు, సిల్వర్ నాణాలను కూడా దొంగలు దోచుకెళ్లారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *