Breaking News
Home / Film News / ఓవర్సీస్ లోను అదే దూకుడు…

ఓవర్సీస్ లోను అదే దూకుడు…

ఫిల్మ్ న్యూస్: తమిళ మాస్ హీరోగా విజయ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమా వసూళ్లతో పాటు క్రేజ్ ను కూడా పెంచుకుంటూ వెళుతున్నాడు. ఈ నెల 25న విడుదలైన ‘బిగిల్’ కూడా అదే తరహాలో తన జోరు చూపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ సినిమా 120 కోట్లను రాబట్టడం విశేషం. ఇంతకుముందు విజయ్ చేసిన ‘సర్కార్’ రెండు రోజుల్లో 100 కోట్లను సాధించగా, ‘బిగిల్’ ఆ మార్కును క్రాస్ చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 10 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్సీస్ లోను అదే దూకుడు చూపుతోంది. ఈరోజు నుంచి ఈ సినిమాకి లభించే ఆదరణను బట్టి, సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకోనుందనేది తెలుస్తుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *