విజయనగరం: బైక్‌ని ట్యాంకర్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నర్సాపురం గ్రామానికి చెందిన గునుపూరు సంతోష్ (15), దత్తి ఈశ్వరరావు (17) మృతి చెందారు. ఈదుపల్లి లోకేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
