Breaking News
Home / National / యువతితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన….

యువతితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన….

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని సికందర్ బాగ్ నుంచి బైక్ టాక్సీపై న్యూ హైదరాబాద్‌లోని కార్యాలయానికి వెళుతున్న 27 ఏళ్ల అమెరికా యువతిని డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. తాకరాని చోట టచ్‌ చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె బైక్ నుంచి దిగిపోయి, తన తోటి ఉద్యోగులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బైక్ టాక్సీ డ్రైవర్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

అమెరికాకు చెందిన ఒక యువతి న్యూ హైదరాబాద్‌లోని మేథా లెర్నింగ్ ఫౌండేషన్‌లో పనిచేస్తోంది. ఉదయం ఆమె తన కార్యాలయానికి వెళ్లేందుకు బైక్ టాక్సీ బుక్ చేసుకుంది. ఆమెను బైక్‌పై తీసుకు వెళుతుండగా డ్రైవర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. శృంగారం గురించి మాట్లాడుతూ.. ఆమెను వేధించడం మొదలెట్టాడు. వద్దని వారించినా వినకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్‌ను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *