ఆధ్యాత్మిక విశ్వ గురువు సైంటిఫిక్ సెయింట్ *శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి 80 వ* జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం దేశం లోని వివిధ ప్రాంతాలలో శ్రీ *స్ఫూర్తి కుటుంబం* ఆధ్వర్యంలో కనుల పండువగా జరిగాయి. గురువుగారి వద్దకు వచ్చే శిష్యులందరినీ గురువుగారు ఒక కుటుంబ సభ్యులుగా పరిగణిస్తారు. భారత దేశంతోపాటు అమెరికా యూకే రష్యా జర్మనీ దుబాయ్ మలేషియా సింగపూర్ ఉక్రెయిన్ కెనడా వంటి దేశాలలో శ్రీ గురు విశ్వస్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురువుగారి జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి.
విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి కుటుంబ సభ్యులందరూ మానవాళి శ్రేయస్సు కోసం గురుభావంతో ఏక కాలంలో ఒకే సమయంలో ఎవరి గృహంలో వారు అందరూ సామూహిక ధ్యానం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఓంకారం శ్రీ గురు ప్రార్థనతో గురుదేవులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల కాన్సెప్టుకు ధ్యాన మనో ప్రస్థానం, రేలిజియస్ హ్యూమానిటీ’ ప్రాక్టికల్ ఫిలాసఫీ పై చర్చలు జరిపారు. శ్రీ గురుదేవులు స్ఫూర్తి కుటుంబ సభ్యులకు ఆత్మీయ దివ్య ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురు విశ్వస్ఫూర్తి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
*భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు …*
శ్రీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలతో భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలను శ్రీ విశ్వస్ఫూర్తి కుటుంబ సభ్యులు నిర్వహించారు
కరోనా ప్రభావంతో బ్లాక్ వన్ లో ఉండి ఇబ్బందులు పడుతున్న సుమారు నాలుగు వేల కుటుంబాలకు శ్రీ గురుదేవులు ఆశీర్వదించిన నిత్యావసర వస్తువులు అందజేశారు. పలు ప్రాంతాలలో అన్న ప్రసాద వితరణ చేశారు . ఈ కార్యక్రమంలో స్ఫూర్తి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Sphoorthi oum. Great efforts.