Breaking News
Home / Crime / కరకట్టపై బర్త్‌డే పార్టీలు.. ర్యాష్‌ డ్రైవింగ్‌…

కరకట్టపై బర్త్‌డే పార్టీలు.. ర్యాష్‌ డ్రైవింగ్‌…

పలువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసు స్టేషన్‌లో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన సీఐ
భద్రాచలం: భద్రాచలంలోని గోదావరి కరకట్టపై బర్త్‌డే పార్టీలు.. ర్యాష్‌ డ్రైవింగ్‌ నిర్వహిస్తున్న పలువురు యువకులను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యువకులను స్టేషన్‌కు తరలించిన పోలీసులు వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో కరకట్టపై బర్త్‌డేే పార్టీలు, ర్యాష్‌ డ్రైవింగ్‌ నిర్వహించిన యువకులు వారి తల్లిదండ్రులకు పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. నిత్యం వేలాదిమంది భక్తులు సంచరించే కరకట్ట పరిసరాల్లో యువకులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరమని, తొలివిడతగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని మళ్లీ పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేసారు.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *