Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీకి బిస్కెట్స్ వేస్తున్నకేంద్రం….

ఏపీకి బిస్కెట్స్ వేస్తున్నకేంద్రం….

ఢిల్లీ: త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి శుభవార్త అందనుంది. కొద్దిరోజుల క్రితం తితలీ తుఫానుతో సిక్కోలు విలవిలడిన సంగతి తెలిసిందే. తుఫాను బాధితులను ఆదుకోవడానికి నష్టపరిహారం చెల్లించాలని.. మొత్తం రూ.3,435కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్రం స్పందించి.. గురువారం సాయంత్రం హోంమంత్రి రాజనాథ్‌ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది.

ఈ భేటీలో.. ఇటీవల వరద ప్రభావానికి గురైన, కేరళ, నాగాలాండ్, ఏపీ రాష్టాలకు ఆర్ధిక సహాయంపై నిశితంగా చర్చించడం జరిగింది. ఫైనల్‌‌గా తితలీ తుఫాను నష్టపరిహారంగా ఏపీకి రూ. 539.52 కోట్లు మంజూరు చేసేందుకు కమిటీ నిర్ణయించింది. కాగా గురువారం రాత్రి లేదా శుక్రవారం మధ్యాహ్నం లోపు కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే .. తుఫాను బాధితులకు రూ.520కోట్ల రూపాయిలను పరిహారంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.

Check Also

రాజోరీ సెక్టార్‌లో పేలుడు.. ఆర్మీ మేజర్ మృతి

Share this on WhatsAppజమ్ముకశ్మీర్: పుల్వామా ఉగ్ర దాడి ఘటన దేశాన్ని దుఃఖసాగరంలో ముంచేసిన విషయం తెలిసిందే. 40 మంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *